రైల్వే కోడూరు నుంచి అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన తెలుగుదేశం పార్టీ నాయకులు

 కడప జిల్లా: రైల్వే కోడూరు నుంచి అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన తెలుగుదేశం పార్టీ నాయకులు పంతగాని నరసింహ ప్రసాద్ మాజీ జెడ్పీటీసీ సభ్యులు నాయుడోరి రమణ మాజీ సర్పంచ్ గడికోట సుబ్బారాయుడు మరికొంతమందిని ఎస్సై వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి వాహనాన్ని అడ్డుకుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. 
రాజధాని అమరావతి ముద్దు మూడు రాజధానులు వద్దు అనే నినాదంతో నిరసన తెలిపేందుకు బయలుదేరగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఇదెక్కడి న్యాయం అని ఆయన ప్రశ్నించారు. నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

Post a Comment

Previous Post Next Post