బ్రేకింగ్: దిశ హత్య కేసు నిందితుల ఎన్‌కౌంటర్.. పారిపోతుండగా కాల్చివేత!
హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన దిశ హత్యాచార కేసులో నిందితులను ఎన్‌కౌంటర్ చేసినట్టు తెలుస్తోంది. చర్లపల్లి జైలు నుంచి నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు సీన్ రీకన్‌స్ట్రక్షన్ కోసం షాద్‌నగర్ తీసుకెళ్లారు. ఆ సమయంలో నిందితులు తప్పించుకునే ప్రయత్నం చేస్తుండగా పోలీసులు ఎన్‌కౌంటర్ చేసినట్టు సమాచారం. పోలీసుల కళ్లుగప్పి పారిపోయేందుకు నిందితులు ప్రయత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా ప్రధాన నిందితుడు అరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. దిశను సజీవ దహనం చేసిన ప్రాంతంలోనే ఎన్‌కౌంటర్ జరగడం గమనార్హం….
వారెవహ్ ఇది నిజమేనా పారిపోతుంటే ఎంకౌంటరా ! ? హాస్యాస్పదంగా లేదు వింటుంటే ..ఒక విషయం ఇక్కడ… మహిళల పై , చిన్నారుల పై , యువతుల పై ఈ విధమైనటువంటి అత్యాచారం హత్య సమర్ధించాల్సిన సంఘటలు కాదు . ఏది ఏమైనా ముమ్మాటికి తప్పే . ఇటువంటి దాడులకు పాలుపడినటువంటి వారికి ముమ్మాటికి శిక్ష పడాల్సిందే . ఈ విషయం లోనే కాదు గతం లో కూడా సజ్జనార్ ఐపీఎస్ చేసిన ఎన్కౌంటర్ ని కూడా సమర్ధించవచ్చు . తప్పులేదు. ఎందుకంటే తప్పుచేసిన వారికి ఒక గుణపాఠం , తప్పు చేయాలనుకున్నవాడికి ఒక భయాన్ని కలిగిస్తుంది.
దేశం లో గాని , తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ లో గాని ఇటువంటి అత్యాచారాలు హత్యలు రోజుకు ఎన్ని జరుగుతున్నాయి , అందులో బహిరంగగా వీడియోలు తీసి అత్యాచారం హత్యలు , అత్యాచారాలు ఇలా చెప్పుకుంటూ పొతే కోకొల్లలు . ఐతే ఇటువంటి సామూహిక అత్యాచారాలు హత్యలు ఎవరిమీద ఎక్కువగా జరుగుతున్నాయి , గతంలో ఎన్ని జరిగాయి , ఎందుకు దిశా కేసుని ఇంత సీరియస్ గ తీసుకున్నారు ? దిశా కి ముందు జరిగిన అత్యాచారారాలు హత్యలు – హత్యలు కావా ? అత్యాచారాలు కావా ? ఎందుకని నేటివరకు ఆయేషా కేసు మరుగున పడింది ? .. చిన్నారులను అతి దారుణంగ రేప్ చేసి హత్య చేసిన శ్రీనివాస్ రెడ్డి ని ఎందుకు ఎన్కౌంటర్ చేయలేదు ? అంటే ఆనాడు అది క్రూరత్వం అనిపించలేదా ? ఆనాడు ఏమయ్యారు వీళ్లంతా ? ఉన్నట్టా .. లేనట్టా ! ?? ఒక వేళా ఉంటె ఎన్కౌంటర్ జరగాలి కదా ! మరి ఎందుకు జరగలేదు ? ఆనాటి తల్లుల కడుపుకోత కడుపుకోత కాదా ? అయేషా తల్లి – తల్లి కాదా ? ఆ తల్లికి కడుపుకోత లేదా ? టేకు లక్ష్మి పై జరిగిన అత్యాచారం – అది అత్యాచారం కాదా ? ఢిల్లీలో సంచలనం సృష్టించిన నిర్భయ కేసు నిందితులకు ఇప్పటికీ మరణ శిక్ష అమలు కాలేదు… ఇలా చెప్పుకుంటూ పొతే కోకొల్లలు కానీ న్యాయం ఎవరికీ జరుగుతుంది ? ఎన్కౌంటర్లు ఎవరి పై జరుగుతున్నాయి ? గమనించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి బాధ్యత .
అయ్యో దిశా భరించలేనిదే – టేకు లక్ష్మి ఎలా భరించిందో !
టేకు లక్ష్మీ శరీరం మీద జరిగిన హింస, దాడులను వివరిస్తుంటే.. నాకు వినడమే కష్టమైంది.. లక్ష్మీ ఎలా భరించిందో..???
◆ అటవీ ప్రాంతం గుండా.. కొండలు ,వాగులు , వంకలు దాటుతూ కాలి నడకన మారుమూల తండాలకు పల్లెలకు వెళ్ళింది లక్ష్మీ.
◆ తిరుగు ప్రయాణంలో ఆటోలుదొరక లేదు మనుషుల తోడు లేదు.
◆ కాలి నడకన అటవీ ప్రాంతం వస్తున్న లక్ష్మీ ని ముగ్గురు తాగుబోతులు అడ్డగించారు.
లక్ష్మీ పారిపోయింది. వాళ్ళు వెంటాడారు ప్రతిఘటించింది.. దాడి చేశారు.
◆ లొంగ లేదు.. హింసించారు చంపేశారు. కనతల మీద కొట్టారు.
తలను చెట్టుకేసి బాదారు.
కత్తిని చేత్తో నిలువరిస్తే..చేతి వేళ్ళు కోసేశారు.
గొంతులో కత్తిని దించారు..
గుండెలపై కొరికిన గాట్లున్నాయి..
దేహమంతటా కత్తి గాట్లున్నాయి..
పెద్ద వాళ్ళుసైతం ఆమె శవాన్ని చూసి భయపడ్డారు.. ఇక
ఆమె ఒంటిపై ఎంతటి క్రూరమైన హింస జరిగిందో ఉహించవచ్చు..
కులం తక్కువ స్త్రీలంటే.. కూటికి లేనోడికి కూడా లోకువె..
ఆమె చావు ఒక వార్త అయ్యిందే తప్ప అందరినీ కదిలించే ప్రాధాన్యతను పొందలేదు.
కులం తక్కువ స్త్రీల కుతికెలు తెగినా.. మానాలు చిద్రమైనా ప్రాణాలు పోయినా
ఎవరికీ పట్టదని మరోసారి ఋజువైంది.
టేకు లక్ష్మి విషయంలో ఎన్కౌంటర్ వద్దా ? ఎందుకని నిందితులను ఎన్కౌంటర్ చేయలేదు ? న్యాయం అందరికి సమానమే కదా ! దిశా ది క్రూరమైన హత్య అత్యాచారం అయినప్పుడు – టేకు లక్ష్మిది కాదా – లేక అదేమన్నా సినిమా షూటింగ్ లా అనిపించిందా ఎన్కౌంటర్ స్పెషలిస్టులకు ! న్యాయం చేయడానికి చిన్న పెద్ద తేడా ఏమైనా ఉందా ? న్యాయం అందరికి సమానమే కదా ? మరి ఎందుకు అమలు కావడం లేదు పేదల పట్ల ?? . కసబ్ లాంటి క్రూరమైన క్రిమినల్స్ కె ప్రత్యేకమైన సదుపాయాలతో పోషించిన సంఘటనలు ఉన్నాయి. మరి అలాంటిది ఈ ఎన్కౌంటర్ ఎవరికోసం ? ఎవరిని మెప్పించడానికి ? అనే ప్రశ్నలు లేకపోలేదు.. నోరు లేని మూగ జీవాలకు …
ఇంతకి ఈ ఎన్కౌంటర్ ని ఎలా తీసుకోవాలి ? కుల హత్య గ తీసుకోవాలా ? లేక బలహీనుల పై పెద్దోళ్ల మగతనమనుకోవాలా ?
ఈ ఎన్ కౌంటర్ తో తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందా ?
దిశ నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడం… ఎవరైనా సరే నిగ్రహం కోల్పోవడం సరికాదు , చట్టాన్ని కాదని శిక్షలు వేస్తే కొంత న్యాయం జరిగిందని భావించవచ్చు … కానీ, ఎన్ కౌంటర్లు చేస్తే తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉంది . దిశ హత్య అత్యంత ఘోరమైన ఘటనే… అయితే, నేరాన్ని రాజ్యమే హత్య చేయడం సరికాదు. ఇలాంటి ఘటనల్లో నేరాన్ని కోర్టులో రుజువు చేసి, అత్యంత కఠినమైన శిక్షలు అమలు చేయవచ్చు . ప్రజలు కోరుకుంటున్నారు కదా అని ఎన్ కౌంటర్లు చేయడం కరెక్ట్ కాదు . ఎన్కౌంటర్లు చేయాలనుకుంటే అప్పుడు రోజుకో ఎన్కౌంటర్ చేయాల్సి వస్తుంది . ఈ ఎన్కౌంటర్ కట్టుకథ అని ప్రజలకు తెలియదా ? ఇన్నాళ్లు నోరు విప్పని బలహీనులు రోడ్డెక్కితే పోలీసులు అదుపుచేయగలరా ?
న్యాయం చెయ్…. చిన్నా పెద్దా తేడా లేకుండా న్యాయం చేయండి . లేదా పేదవాడి కడుపుమండితే మరో గోరేగావ్ చూడాల్సిన పరిస్థితి వస్తుంది ….
ముందడుగు వేసి న్యాయ పోరాటం చేసిన కథనాలు: Writter & Publisher : V.Sudhakar – Journalist
Post a Comment