క్షుద్రపూజల పేరిట కలకలం సృష్టించి భయభ్రాంతులకు గురి చేసిన వ్యక్తి అరెస్ట్



  •  అమ్మాయిని ప్రేమ పేరుతో వెంటపడి వినకపోవడంతో చివరకు చేతబడి పేరుతో వేదింపులు.
  • సోషల్ మీడియా లో చూసిన వీడియొల ఆధారంగా చేతబడి చర్యలు.
  • గ్రామంలో రెండు సార్లు చేతబడి పేరుతో భయభ్రాంతులకు గురైన గ్రామస్తులు నేరస్థుడు దొరకడంతో ఊపిరిపిల్చుకున్నారు.

Nalgonda: తేదీ :07.07.2021 గుండ్లపల్లి గ్రామంలో తెల్లవారుజామున పోల్లోజు వేంకటాచారి ఇంటి గేటు దగ్గర చేతబడులకు సంబందించిన వస్తువులు (ఎముక, జాకెట్ ముక్కలు , బియ్యం, కుంకుమ, గాజులు, జీడిగింజలు, వెంట్రుకలు, నిమ్మకాయలు మొ..)కనబడడంతో పోలీసులకు సమాచారం అందించిన వెంటనే పోలీసులు సంగటనాస్థలానికి చేరుకొని గ్రామస్తులు ఎవరు ఆందోళన చెందవద్దని, నేరస్థున్ని ఎలాగైనా పట్టుకుంటామని భరోసా కల్పిస్తూ కేసు నమోదు చేసి గ్రామంలో ఉన్న సి‌సి కెమరాలు ఆధారంగా cell tower data ఆధారంగా ఫిర్యాది కుటుంబ సభ్యుల విచారణ ఆధారంగా తేదీ:12.07.2021 ఉదయ్యం 8 గంటలకి ఇట్టి చర్యలను చేసిన నింధితుణ్ణి సమాచారం ఆధారంగా మునుగోడు బైపాస్ వద్ద పట్టుబడి చేసి విచారించనైనది తన పేరు కూడతల మురలి s/o ఈశ్వరయ్య వయస్సు:30 సం. వృతి:ప్రైవేటు జాబ్ R/ఓ రంగారెడ్డి నగర్ అని చెప్పుతూ 9 నెలల క్రితం అనుకోకుండా wrong number కు dail చేయగా ఒక అమ్మాయి పరిచయం అయినది అప్పటినుండి phones,messages, చేస్తుండేవాడిని ఆ పరిచయం లో భాగంగా ఆమెపై ఇష్టం పెరిగి ప్రేమిస్తున్నాను అని చెప్పగా సదరు మహిళా ఒప్పుకోకపోగా, కొద్ది రోజుల తర్వాత ఆ మహిళకు వివాహం అయినదని తెలిసి, ఎలాగైనా సరే ఆమెను దక్కించుకోవాలని ఆమె కొత్త సంసారం చెడగొట్టాలని నిర్ణయించుకొని, youtube లో Facebook లో నేను గతంలో చూసిన వీడియొలా ఆధారంగా చేతబడి వంటివి చేస్తే భయపడతారని, పెండ్లి ఐనా దగ్గర నుండి కుటుంబ సభ్యులు ఆమె ద్వారానే ఇదంతా జరుగుతుందని భావించి విడిపోయేలా చేయాలని, దీనిపైన పోలీసులకు కూడా చెప్పరని, దీనిని పదే పదే చేయాలని నిర్ణయించుకొని మొదట తేదీ : 18.06.2021 రోజు కుంకుమ, పసుపు జీడి గింజలు ఇంటి ముందర వేసాను. తర్వాత ఆ మహిళ భర్తకి ఫోన్ చేసి తిట్టి బెదిరించాను. మళ్ళీ తేదీ: 06.07.2021 రోజు రాత్రి సుమారు 12.00 గంటల సమయం లో నా బైక్ స్ప్లెండర్ పై గుండ్లపల్లి వచ్చి ఇంటి ముందర గేటు దగ్గర, ముందే కల్పుకున్న (ఎముకలు,కుంకుమ,జీడిగింజలు,గవ్వలు,నిమ్మకాయలు,వెంట్రుకలు,వక్కలు, తెల్ల , నల్లటి గుడ్డ ముక్కలు ,కుంకుమ మరియు పసుపు కల్పిన బియ్యం ) వస్తువులను గేటు దగ్గర పెట్టడం జరిగింది. తరువాత పోలీసులు గుండ్లపల్లి కి వచ్చి విచారిస్తున్నారని తెల్సుకోని దొరకకుండా నా బైక్ ను దాచి పెట్టి తిరుగుచుండగా, ఈ రోజు ఉదయం పోలీసులు పట్టుకొని Remand కు తరలించనైనది.
ఇట్టి కేసులో ప్రతిభ చూపి నేరస్థుడిని త్వరగా గుర్తించి remand చేసిన సిబ్బంది Rural SI రాజశేఖర్ రెడ్డి, PSI రాజశేకర్ రెడ్డి మరియు Constables హట్టి , నాగరాజు, సలీం తదితరులను DSP గారు అభినందించినారు.
విలేకరుల సమావేశంలో టూ టౌన్ సిఐ చంద్రశేఖర్ రెడ్డి, రూరల్ ఎస్.ఐ. రాజశేఖర్ రెడ్డి, ట్రైనీ ఎస్.ఐ. రాజశేఖర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


0/Post a Comment/Comments

Previous Post Next Post