చిత్తూరు జిల్లా లో అంతర్రాష్ట్ర ఎర్ర చందనం స్మగ్గ్లర్ అరెస్టు, 6.2 కోట్ల విలువైన 8.4 టన్నుల 243 ఎర్రచందనం దుంగలు, ఒక Innova, ఒక Bolero Pick-up స్వాధీనం గురించి.
10.07.2021 వ తేది తెల్లవారుజామున 4.00 AM గంటలకు ఒక ఇన్నోవా కారులో దొరికిన ఎర్రచందనం కేసులో అరెస్ట్ అయిన ముద్దాయిని విచారించగా, బెంగళూరు కు చెందిన ఎర్రచందనం స్మగ్గ్లర్ అయిన D. ఇమ్రాన్ ఖాన్ @ ఇమ్రాన్ భాయ్ అనునతని గురించి తెలిసిన సమాచారంతో బెంగలూరు, హోసూరు మరియు శివారు ప్రాంతాలలో సంచరించి 11.07.2021 వ తేది రాత్రి 7.00 PM గంటలకు తమిళనాడు రాష్ట్రం, క్రిష్ణగిరి జిల్లా, హోసూరు తాలూకా, బొమ్మనపల్లి శివారు ప్రాంతంలో రవి అనునతని గోడౌన్ వద్ద ఉన్న 2 వ ముద్దాయి ఇమ్రాన్ ఖాన్ @ ఇమ్రాన్ భాయ్ పైన మెరుపు దాడి చేసి అతనిని పట్టుకొని, గోడౌన్ లో గుజురి సామాన్ల కింద దాచి ఉన్న 238 ఎర్రచందనం దుంగలు ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. వాటి బరువు 8.2 టన్నులు, వాటి విలువ అంతర్జాతీయ మార్కెట్ లో 5.6 కోట్లు ఉంటుంది. విచారణలో ఈ దుంగలు శేషాచలం అడవిలో ఉన్న చెట్లను నరికినట్లుగా, వీటిని బెంగాలురుకు తరలించి, అక్కడి నుండి ముంబై, డిల్లీకి తరలిస్తారని తేలింది.
Post a Comment