ప్రముఖ ఫిల్మ్ క్రిటిక్, నటుడు కత్తి మహేశ్ మృతి చెందారు. గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురైన ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. త్వరలోనే కుదుటపడుతుందనుకున్న ఆయన ఆరోగ్యం విషమించింది. అకస్మాత్తుగా శ్వాసకోస సమస్యలు తలెత్తడంతో తుదిశ్వాస విడిచారు.
కత్తి మహేశ్ మృతితో టాలీవుడ్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. గత నెలలో నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్న కారు.. లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో కత్తి మహేశ్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.
Post a Comment