కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో సిపిఐ ముఖ్యల సమావేశం శ్రీశైలం అధ్యక్షతన జరిగింది ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కామ్రేడ్ అశోక్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం, దళితులకు 3 ఎకరాల భూ పంపిణీ చేయాలని ఈ నెల 15 న కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలాగే ప్రభుత్వ భూముల వేలం నిలిపి వేయాలని జి,ఓ.No 13 ను ఉపసంహరణ చేయాలని, ప్రభుత్వ భూములను కాపాడాలని మరియు ల్యాండ్ బ్యాంకు ను ఏర్పాటు చేయాలని, దళితులకు, గిరిజనులకు, వెనకబడిన వర్గాల ప్రజలకు ప్రభుత్వ భూములు పంపిణీ చేయాలి.ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి కాంతాల అంజి రెడ్డి, AISF రాష్ట్ర సహాయ కార్యదర్శి బోనగిరి మహేందర్, మండల సహాయ కార్యదర్శి చొక్కా ల్లా శ్రీశైలము, మోలుగురి సంపత్, ఆంజనేయులు, భగవాన్ రెడ్డి, సాగర్ రెడ్డి, కూన మల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.
Post a Comment