జియో లో బ్రాంచ్ మేనేజర్ జాబ్స్ ..

 రిలయన్స్ జియో టెలికాం రంగంలో తనకంటూ ఒక గొప్ప స్థానాన్ని ఏర్పరుచుకున్న సంస్థ. ఇప్పటికే, ఆ సంస్థ వారు ఎన్నో వేల మందికి ఉపాధిని కల్పించారు. ఇంకా కొంతమంది నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించాలనే ఉద్దేశంతో తాజాగా, careers.jio.com వెబ్ సైట్ ద్వారా ఓ జాబ్ ప్రకటన కూడా విడుదల చేసారు. డిగ్రీ, పీజీ చదువుకున్నవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అనుభవం ఉన్న వారిని, ఫ్రెషర్స్ ను కూడా జియో సంస్థ ఆహ్వానిస్తుంది. అర్హతలు కలిగివున్న ఆసక్తిగలవారు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ భాగాల కింద భర్తీ చేయబోయే జాబ్స్ ఇవే… జియో పాయింట్ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, సేల్స్ ఆఫీసర్, సీనియర్ ఎంటర్‌ప్రైజ్ సేల్స్ ఆఫీసర్, డేటా ఇంజినీర్, డెవలపర్ అప్లికేషన్ ఇంజినీర్, బ్యాకెండ్ డెవలపర్. పైన పేర్కొన్న ఉద్యోగాలకు బీఈ/బీటెక్, బీకామ్, బీఎస్సీ, బీసీఏ ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, డిప్లొమా పూర్తిచేసిన వారు అర్హులు. ఉద్యోగాలకు కావాల్సిన స్కిల్స్:- కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ఆంగ్ల బాషా లో చదవడం, రాయడం, మాట్లాడటం తెలిసి ఉండాలి. ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లను, ఐ ఫోన్ లను వాడటం తెలిసుండాలి.
( ఈ వార్త / వెబ్ పేజ్ నందు ఉపయోగించిన ఇమేజ్/ఛాయాచిత్రాలు గూగుల్ ఓపెన్ సోర్స్ నుండి తెసుకోనబడెను . )
credit: third party image reference

Post a Comment

Previous Post Next Post