ఇండియన్‌ ఆర్మీలో మెడికల్‌ సర్వీసెస్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

 

భారత సైన్యంలోని సాయుధ దళాల వైద్య సేవల కోసం ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ సర్వీసెస్‌.. షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎస్‌ఎస్‌సీ) ప్రాతిపదికన డాక్టర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఎంబీబీఎస్‌ మొదటి లేదా రెండో ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించిన స్త్రీ, పురుష అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు.


వివరాలు:

మొత్తం పోస్టుల సంఖ్య : 300

పురుషులు: 270

మహిళలు: 30

అర్హతలు:

ఎంబీబీఎస్‌ మొదటి లేదా రెండో ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించాలి

అభ్యర్థులు ఏదైనా∙రాష్ట్ర వైద్యమండలి/ఎంసీఐలో తమ పేరును నమోదు(పర్మనెంట్‌ రిజిస్ట్రేషన్‌) చేసుకొని ఉండాలి.

స్టేట్‌ మెడికల్‌ కౌన్సిల్‌/ఎంసీఐ/ఎన్‌బీఈ గుర్తించిన పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ/ డిప్లొమా హోల్డర్లు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

జూన్‌ 30, 2020 లేదా అంతకుముందు ఇంటర్న్‌షిప్‌ పూర్తిచేసిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.

వయసు : డిసెంబర్‌ 31, 2020 నాటికి 45 ఏళ్లకు మించకుండా ఉండాలి.


ఎంపిక ప్రక్రియ: సర్టిఫికెట్ల పరిశీలన, ఇంటర్వ్యూ, మెడికల్‌ టెస్ట్‌ల ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.

వేతనం: రూ.61,300+ ఇతర అలవెన్సులు


దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌ విధానంలో దర ఖాస్తు చేసుకోవాలి.


దరఖాస్తు ఫీజు : రూ.200/–


దరఖాస్తులకు చివరి తేదీ : ఆగస్టు 16, 2020.


పూర్తి సమాచారం కొరకు క్లిక్‌ చేయండి: www.amcsscentry.gov.in


0/Post a Comment/Comments

Previous Post Next Post