27న జరిగే బహుజన సంఘాల విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయండి :బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి: దాసరి ప్రవీణ్ కుమార్ నేత

 


జనాభా దామాషా ప్రకారం బిసీ,యస్సీ,యస్టి రిజర్వేషన్లు పెంచిన తరువాతే అగ్రవర్ణ రిజర్వేషన్లు ఆమలు చెయాలనే డిమాండ్ తో ఈనెల 27న హైదరాబాద్ లో బిసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరుగబోయే 🇫🇷 బహుజన సంఘాల విస్తృత స్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని బిసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి దాసరి ప్రవీణ్ కుమార్ నేత పిలుపునిచ్చారు సోమవారం రోజున చిగురుమామిడి మండల కేంద్రంలో ఆయన మాట‌్లాడుతూ బిసీలు 56%శాతం ఉంటే 25%శాతం రిజర్వేషన్లని, యస్సీలు 20%శాతం ఉంటే 15%శాతం రిజర్వేషన్లని, యస్టీలు 12%శాతం ఉంటే 6%శాతం రిజర్వేషన్లని, మైనార్టిలు 12%శాతం ఉంటే 4%శాతం రిజర్వేషన్లు ఉన్నాయని దాసరి ప్రవీణ్ కుమార్ నేత ప్రశ్నించారు అగ్ర వర్ణాలు 9℅ శాతం ఉంటే 10%రిజర్వేషన్లా? అని,  90%శాతం ఉన్న బడుగులకు 50%శాతం రిజర్వేషన్లు కేవలం 9% ఉన్న అగ్ర వర్ణాలకు 100% రిజర్వేషన్లా? అని ఇదెక్కడి న్యాయమని కేసీఆర్ ప్రభుత్వాన్ని దాసరి ప్రవీణ్ కుమార్ నేత ప్రశ్నించారు. ఓ బహుజన మేలుకో..నీ వాట దక్కించుకో అంట‌ూ భవిష్యత్ ఉద్యమ కార్యచరణ కోసం ఈనెల 27న హైదరాబాద్ లో జరుగబోయే బహుజన సంఘాల విస్తృత స్థాయి సమావేశాన్ని బహుజనులందరూ పాల్గొని విజయవంతం చేయాలని దాసరి ప్రవీణ్ కుమార్ నేత కోరారు

0/Post a Comment/Comments

Previous Post Next Post