భారీ ఎన్‌కౌంటర్ - ఐదుగురు పోలీసులు మృతి

 


ఛత్తీస్ ఘడ్‌లో పోలీసు బలగాలు, మావోయిస్టుల మధ్య శనివారం ఎదురుకాల్పులు జరిగాయి. బీజాపూర్ జిల్లా తర్రం అటవీప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ లో ఐదుగురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయపడినట్లు సమాచారం.

ఛత్తీస్‌గఢ్‌ డీజీపీ డీఎం అవస్థీ తెలిసిన వివరాల మేరకు.. మావోయిస్టుల ఉనికిని తెలుసుకున్న సీఆర్పీఎఫ్‌కు చెందిన ఎలైట్ కోబ్రా (కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్) యూనిట్, జిల్లా రిజర్వ్ గార్డ్ (డీఆర్జీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్‌)కు చెందిన భద్రతా సిబ్బంది సంయుక్తంగా కూంబింగ్‌ చేపట్టారు. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడటంతో ఇరువైపులా కాల్పులు జరిగాయి. ఐదుగురు భద్రతా సిబ్బంది మరణించగా మరో పది మందికిపైగా గాయపడినట్లు వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు కూడా చనిపోయినట్లు తెలిపారు.

వెంటనే అదనపు భద్రతా దళాలను అక్కడికి తరలించినట్లు డీజీపీ చెప్పారు. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్‌ ఇంకా కొనసాగుతున్నదని పేర్కొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post