విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ స్థాయి NSS సలహా కమిటీ సమావేశం



నెల్లూరు జిల్లా :విశ్వవిద్యాలయ స్థాయి NSS సలహా కమిటీ సమావేశం ఉపకులపతి గారి ఛాంబర్ నందు జరిగింది. కార్యక్రమానికి ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు గారు అధ్యక్షతన NSS సలహా కమిటీ సమావేశం అయ్యింది. ఈ సందర్భముగా ఉపకులపతి ఆచార్య ఆర్ సుదర్శన రావు గారు మాట్లాడుతూ విశ్వవిద్యాలయ జాతీయ సేవా పధకం సేవలు అమోఘమని ప్రశంసించారు. గడిచిన మూడు సంవత్సరాలలో NSS విభాగం చేపట్టిన పలు సేవా కార్యక్రమాల గురించి వివరించారు. తదనంతరము రెక్టార్ ఆచార్య యం చంద్రయ్య గారు మరియు రిజిస్ట్రార్ డా. యల్ విజయ కృష్ణా రెడ్డి గారు NSS విభాగం చేపట్టిన పలు కార్యక్రమాల గురించి వివరించి ప్రశంసించారు. రాష్ట్ర NSS అధికారి డా. కె. రమేష్ రెడ్డి విశ్వవిద్యాలయం లో NSS ఆవిర్భావం గురించి పలు ఆసక్తికర అంశాలు తెలియచేసారు 

తదనంతరం NSS సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం వి ఎస్ యు NSS విభాగం 2018-2019, 2019-2020, 2020-2021 సంవత్సరాలలో చేపట్టిన పలు కార్యక్రమాల గురించి, బడ్జెట్ గురించి మరియు 2021-2022 లో చేపట్టవలసిన కార్యక్రమాల ప్రణాళికను కమిటీ సభ్యులందరికి విపులంగా వివరించి కమిటీ సభ్యుల ఆమోదం తీసుకొన్నారు. ఆ తరువాత కమిటీ సభ్యుల అందరి సలహాలు మరియు సూచనలు స్వీకరించారు. ఈ సమావేశానికి విశ్వవిద్యాలయ స్థాయి NSS సలహా కమిటీ సభ్యులు అయినా , ఆచార్య సుజా ఎస్ నాయర్, ఆచార్య యమ శ్రీనివాస రావు , డా కె. సునీత, డా.  యం హనుమా రెడ్డి, డా. వై విజయ,  NYKS యూత్  ఆఫీసర్ డా. ఏ మహేంద్ర రెడ్డి,  డి కె కళాశాల ఇంచార్జి ప్రిన్సిపాల్  లక్ష్మి ప్రసన్న , NCC ఆఫీసర్ కెప్టెన్ యుగంధర్ రెడ్డి, శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ డా. యం భాస్కర్ నాయుడు, రామ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ పి. సుబ్రహ్మణ్యం , NSS సిబ్బంది ఉస్మాన్,స్వాతి, మరియు NSS వాలంటీర్ బెల్లం కొండ పూర్ణ పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post