మానవ హక్కుల కమీషన్ ఏర్పాటు పై మాలమహానాడు రాష్ట్ర కన్వీనర్ కొర్రపాటి సురేష్ హర్షం

 


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రలో మానవ హక్కుల కమీషన్ ఏర్పాటు విస్మరించాయని.గత తెదేపా ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందగా అధికారం లోకి వచ్చిన రెండేళ్ళకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం హర్షణీయమని.ఏడేళ్ళుగా మాలమహానాడు రాష్ట్రంలో మానవ హక్కుల కమీషన్ సాధనకై పోరాటం చేసిందని రాష్ట్రంలో ఎందరో మేధావులు ఇందుకు కృషి చేశారని వారందరికీ కృతఙతలు తెలిపారు.అక్రమ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు,నిరాధార కేసుల నుండి మానవ హక్కుల కమీషన్ అగ్రవర్ణాలకు ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ వంటి అన్ని సామాజిక వర్గాలకు రక్షణ కల్పిస్తుందని.ఎస్ హెచ్ ఆర్ సి కి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక భవనాలు కేటాయించాలని ఛైర్మన్ సభ్యులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేయాలని.ముఖ్యమంత్రికి మాలమహానాడు రాష్ట్ర కన్వీనర్ కొర్రపాటి సురేష్ ప్రత్యేక అభినందనలు తెలిపారు.నూతన ఎస్సీ కమీషన్ కూడా త్వరగా ఏర్పాటు చేయాలని బుధవారం ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post