కరీంనగర్ జిల్లా వీణవంక పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ గాజర్ల యాదగిరి కరోనా వ్యాధితో మృతి చెందారు వేములవాడ పట్టణంలో జరిగిన శివరాత్రి వేడుకలు బందోబస్తుకు ఈనెల 8వ తేదీన విధులు నిర్వహించిన ఆయన తన సొంత గ్రామమైన పెద్దపల్లి కి వెళ్లారు అక్కడ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడంతో కరీంనగర్ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు వైద్యులు పరీక్షలు నిర్వహించి కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు అక్కడి నుండి హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ నేడు తుది శ్వాస విడిచారు అయిన మృతిపట్ల పోలీస్ సిబ్బంది మండల ప్రజాప్రతినిధులు అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు . గత సంవత్సరం ముందు కరీంనగర్ జిల్లా గన్నేరువరం పోలీస్ స్టేషన్లో గాజర్ల యాదగిరి కానిస్టేబుల్ గా విధులు నిర్వహించారు గన్నేరువరం లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఏఎస్ఐ గా ప్రమోషన్ రావడంతో గన్నేరువరం నుండి కరీంనగర్ జిల్లాలోని వీణవంక పోలీస్ స్టేషన్ కు బదిలీ గా వెళ్ళాడు ఆయన మరణం వార్త చూసి ఆయన మృతి పట్ల గన్నేరువరం పోలీస్ సిబ్బంది మండల ప్రజాప్రతినిధులు అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు
Post a Comment