'బాబు'పై అక్రమ కేసుల కు నిరసనగా టీడీపీ ధర్నా .... జగన్ దిష్టిబొమ్మ దహనం

 


తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబునాయుడు గారిపై అక్కడి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  అక్రమ కేసులు బనాయిస్తూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతిన్నందుకు నిరసనగా బుధవారం తెలంగాణ చౌక్ వద్ద టీడీపీ కరీంనగర్ నియోజకవర్గం కో- ఆర్డినేటర్, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కళ్యాడపు ఆగయ్య ఆధ్వర్యంలో  ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు ఇవ్వడమే కాకుండా ఆయన  దిష్టిబొమ్మను కూడా దహనం చేశారు.

అనంతరం    నియోజకవర్గం కో ఆర్డినేటర్  కళ్యాడపు ఆగయ్య మాట్లాడుతూ అక్రమ కేసులు ఎన్ని బనాయించినా  చంద్రబాబుకు ఒరిగేదేమీ లేదన్నారు. అమరావతి భూము ల్లో ఏస్సీ, ఎస్టీ,బీ సీ లకు అన్యాయం జరిగిందంటూ మంగళగిరి ఎమ్మెల్యే చేసిన ఫిర్యాదు చేయడం సిగ్గుచేటన్నారు.భూసేకరణ సమయంలో రాని ఫిర్యాదు ఇప్పుడు రావడం శోచనీయమన్నారు.    సీ ఐ డీ దర్యాప్తునకు హాజరు కాకుంటే అరెస్ట్ చేస్తామని అక్కడి సీఐ బెదిరింపులకు పాల్పడం వెనుక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రమేయం  ఉందన్నారు. కక్ష సాధింపు చర్యలకు ఇకనైనా స్వస్తి పలకాలని, బాబుపై బనాయించిన తప్పుడు కేసులు వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేసినారు. లేకుంటే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఈ ధర్నా టీడీపీ నాయకులు ఎడ్ల వెంకటయ్య, ఎస్.రాజేశం, రొడ్డ శ్రీధర్, ఎర్రవెల్లి రవీందర్, రొడ్డ శ్రీనివాస్, సాయిల్ల రాజమల్లయ్య,ఎర్రోజు హయగ్రీవచారి, వెల్మల లక్ష్మణరావు, చేవూరు నరసింహాచారి,మిట్టపల్లి శ్రీనివాస్, ఎర్రవెల్లి వినీత్, అందె లక్ష్మణ్, దేశ నరేందర్ దత్తు,  సాన రామేశ్వర్ రెడ్డి, కుంబాల కిష్టయ్య, బొట్ల భారతమ్మ, కుమ్మరి దుర్గయ్య, పోతుల రాజేష్, ఉప్పు నారాయణ, మేకల రాయమల్లు, ఓరుగళ్ల తిరుపతి, మేకల రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post