కరీంనగర్ జిల్లా: ప్రైవేట్ ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరుతూ సోమవారం టీఎస్ఎన్ఎఫ్ ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహానికి మెమొరాండం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పర్లపల్లి రవీందర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వల్ల ప్రైవేటు ఉపాధ్యాయులు రోడ్డున పడ్డారు వారిని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, అదే విధంగా వారికి నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లాలో ఆర్థిక ఇబ్బందులతో ప్రైవేటు టీచర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలచి వేసిందని, ఆత్మహత్య చేసుకున్న ఉపాధ్యాయుడి కుటుంబానికి 20 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి అదే విధంగా రాష్ట్రంలో ఉన్న ప్రైవేటు ఉపాధ్యాయుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేని యెడల ముఖ్యమంత్రి ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. అదే విధంగా రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 17వేల ఉపాధ్యాయుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, అదే విధంగా రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న లక్ష 50వేల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ కరీంనగర్ పార్లమెంట్ అధ్యక్షుడు టేకుల శ్రావణ్ కుమార్,టీఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర నాయకులు తోట మనోహర్ పటేల్,బోడపట్ల రాజేష్, తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శులు బీరెడ్డి కరుణాకర్ రెడ్డి, బత్తిని సతీష్ గౌడ్, తెలుగు యువత పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి బండారుపల్లి ఆంజనేయులు, మనోహర్, ఆర్భాజ్ ,టి.రాజేష్,భూపేష్ తదితరులు పాల్గొన్నారు.
Post a Comment