గన్నేరువరం మండలంలో ఎంపీడీవో దర్శన్ ఇంటింటి సర్వే


 

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల పరిధిలోని 16 గ్రామ పంచాయతీ ల పరిధిలోని నివాసగృహాలు,దుకాణ సముదాయలు మరియు ఇతర కట్టడాల వివరములను మొబైల్ యాప్  ద్వారా పంచాయతి కార్యదర్శులు అన్ లైన్ లో నమోదు చేస్తున్నారు సోమవారం గన్నేరువరం ఎంపీడీవో దర్శన్ మాదాపూర్,ఖాసీంపెట్, పారువెళ్ల ,చాకలివానిపల్లె, గ్రామాల్లో సందర్శించారు ఆయన మాట్లాడుతూ  ఇట్టి నమోదులో గృహ యజమాని వివరములు, వారి యొక్క కుటుంబ సభ్యుల వివరములు యజమానికి భూమి వుంటే అట్టి పాస్ బుక్ సర్వే నెంబర్ మరియు ప్లాట్ యొక్క విస్తీర్ణం గజాలలో నిర్మాణ ఏరియా ఫీట్లలో తీసుకోబడును  మొత్తము సమాచారము ఆ గృహ యజమాని ఇచ్చినవి మాత్రమే నమోదు చేస్తారని  ఇట్టి ప్రక్రియ  ద్వారా ఇంటి పన్ను పెరగడము గాని లేదా ఇంటి యజమానికి ఏదైనా సమస్య రావడము గాని జరగదు వ్యవసాయ భూములకు పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇచ్చిన మాదిరి గానే వ్యవసాయేతర భూములలోని కట్టడాలకు పాస్ పుస్తకాలు జారి చేయడానికి జరిగే కసరత్తులో భాగంగా ఇట్టి నమోదు కార్యక్రమము జరుగుతున్నది  కావున గృహ యజమానులెవరు ఆందోలన చెందవలిసిన అవసరము లేదని మీ వద్దకు వచ్చిన పంచాయతీ కార్యదర్శులకు పూర్తిస్థాయిలో  సహకరించాలని మండల ప్రజలను  కోరారు

0/Post a Comment/Comments

Previous Post Next Post