పోలీసుల దెబ్బలకి యువకుడు మృతి - బంధువుల ఆందోళన





  •  సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం బేగంపేట గ్రామానికి చెందిన శ్రీనివాస్(35) పోలీసులు కొట్టడంవల్లనే మృతి చెందాడని బంధువులు ఆరోపణ
  • శ్రీనివాస్ మృతి పై విచారణ చేపట్టాలని మృతుడు కుటుంబ సభ్యుల డిమాండ్.
  • తమకు సమాచారం ఇవ్వకుండానే వెంటీలేటర్ తీశారని కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యుల ఆందోళన చేస్తున్నారు.


శ్రీనివాస్ అక్క కూన పద్మ  మీడియా మాట్లాడుతూ కాలక్షేపానికి పేకాట అనుడుతున్నతమ తమ్ముడు శ్రీనివాను బెజ్జంకి పోలీసులు పట్టుక కొట్టుకుంటూ తీసుకపోయారని తెలిపారు.తిరిగి రాత్రి 11 గంటలకు అపస్మారక స్థితిలో ఇంటి వద్ద పోలీసులు దింపి వెళ్లారు...అతడ్ని చూసిన కుటుంభం సభ్యులు కరీంనగర్ హాస్పిటల్ లో చేర్పించగా చికిత్స పొందుతూ ఈ రోజు మధ్యాహ్నం మృతి చెందాడని తెలిపారు.శ్రీనివాస్ మృతికి బెజ్జంకి ఎస్సై చంద్రశేఖర్  దాడి చేయడం వల్లనే శ్రీనివాస్ మరణించాడని తెలిపారు.శ్రీనివాస్ మృతి పై విచారణ చేపట్టాలని మృతుడు కుటుంబ సభ్యుల డిమాండ్.



0/Post a Comment/Comments

Previous Post Next Post