రాజమహేంద్ర వరం బొమ్మూరు లో కరోనా అనుమానిత రోగులకు ఉపయోగించిన బయో వెస్ట్ అడ్డగోలుగా బాధ్యత లేకుండా రోడ్డు పక్కన వేసిన దృశ్యం మనం చూస్తున్నాము .కరోనా అత్యంత ప్రమాదకరమని ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి , టీవీలలో పేపర్లలలో కరోనా వార్తలు దుమ్మురేపుతున్నాయి , అలాంటిది ఇంత బాధ్యత రహితంగా ఎలా వ్యవహరించారు అక్కడి అధికారులు గాని సిబ్బంది గాని ఈ వెస్టీజ్ చుట్టూ ఉంటున్న ప్రజలకు ఇది చాలా ప్రమాదకరం కుక్కలు, పందులు అన్నీ ఆ వ్యర్థాన్ని తాకుతున్నాయి మరియు సమీప గృహాల కారణంగా ప్రజలు వస్తుపోతూ ఉంటారు .. ఈ వెస్టీజ్ ఉన్నటువంటి ప్రాంతాల చుట్టూ దాదాపు 10000 మంది ప్రజలు నివసిస్తున్నారు . ఇంత భయంకరమైన కరోనా వైరస్ గురించి తెలిసి అధికారులు ఎలా అనుమతిచ్చారు ? ప్రజలు బయటికి వస్తేనే పొలిసు వారు గొడ్డుని బాదినట్టు కొడుతున్నారు , లాక్ డౌన్ అంటున్నారు … ఇదంతా దేనికోసం ? ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే తగు చెర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు
Post a Comment