ఇరుకుల్ల నర్సయ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన సిపి కమలాసన్ రెడ్డి - పోలీస్ శాఖ నుండి 1,70,000 ఆర్థిక సాయం

 


కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం జూగుండ్ల గ్రామానికి కరీంనగర్ పోలీస్ కమీషనర్ కమలహాసన్  రెడ్డి విచ్చేసి గత శనివారం కరీంనగర్ ఆటోనగర్ లో హత్యకు గురైన ఇరుకుల్లా నర్సయ్య కుటుంబాన్ని పరామర్శించారు కష్టజీవి  నర్సయ్య సంబంధం లేని విషయానికి దండుగుల చేతిలో హత్యకు గురికావడం బాధాకరమని నిందితులకు కఠిన శిక్ష పడేలా చూస్తామని కుటుంబానికి మనో ధైర్యం చెప్పారు నర్సయ్య ముగ్గురు పిల్లల భవిషత్తు కోసం పోలీస్ శాఖ నుండి సేకరించిన 1,70,000  చిన్నారుల పైన పోస్ట్ ఆఫీసు లో ఫిక్స్ చేసిన పాసు పుస్తకాలు అందించి.. వారికి నిత్యావసరాలు 1 క్విటాలు బియ్యం నూనె పప్పులు,ఇతర వస్తువులు అందజేశారు అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయానికి వెళ్లి సర్పంచ్  సైట్ల ఏల్లేశ్ తో నర్సయ్య కుటుంబానికి అండగా ఉండాలని ప్రభుత్వ పథకాలు అలాగే డబుల్ బెడ్ రూమ్ ఇల్లు వారికి అందేలా చూడాలని సూచించారు మానవతా దృక్పథంతో నర్సయ్య కుటుంబాన్ని కలవడానికి వచ్చి సహాయం చేసినందుకు నర్సయ్య భార్య పిల్లలు తల్లి తండ్రులు దుఃఖం దిగమింగుతూ కృతజ్ఞతలు తెలిపారు గ్రామానికి వచ్చిన   సీపీ కమలాసన్ రెడ్డి కి గ్రామ సర్పంచ్ ఏల్లేశ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు

0/Post a Comment/Comments

Previous Post Next Post