డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసులు అత్యంత అమానుషంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఆయన బట్టలు విప్పించి, చేతులు వెనక్కి కట్టి, దుర్భాషలాడుతూ, కొట్టారు. అంతేకాదు ఆయన మానసిక పరిస్థితి బాగోలేదని కేజీహెచ్ వైద్యులు సర్టిఫికెట్ ఇవ్వడంతో... ఆయనను మానసిక వైద్యశాలకు తరలించారు. సుధాకర్ అంశం ఏపీలో చర్చనీయాంశంగా మారింది.ఈ నేపథ్యంలో ప్రభుత్వంపై విపక్షాలు మండిపడ్డాయి. మాస్కులు లేవని ప్రశ్నించిన డాక్టర్ ను సస్పెండ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం... ఆయనపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విపక్ష నేతలు మండిపడ్డారు. మరోవైపు, డాక్టర్ సుధాకర్ ఘటనపై ఏపీ హైకోర్టులో పిటిషన్ లు దాఖలయ్యాయి. పిటిషన్ పై ఈరోజు హైకోర్టులో వాదనలు జరిగాయి. డాక్టర్ పై జరిగిన దాడిని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఆయనపై దాడి చేసిన పోలీసులపై సీబీఐ విచారణకు ఆదేశించింది. పోలీసులపై సీబీఐ వెంటనే కేసు నమోదు చేసి, విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. 8 వారాల్లోగా నివేదికను అందించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.
డాక్టర్ సుధాకర్ పై వైజాగ్ పోలీసుల దాడిని తీవ్రంగా పరిగణించిన హైకోర్టు.. పోలీసులపై సీబీఐ విచారణకు ఆదేశం!
byThe Reporter Telugu India
-
1
Tags
AP NEWS
Posted by The Reporter Telugu India
The Reporter News is a Alternative Digital Channel in Telugu States. The Reporter News Stands for True Education, Women Empowerment, Scientific Temperament, Alternative Culture, Alternative Literature, Dignity Of Labor, Clean Entertainment, Public Journalism, Rural Life Style and Transforming the Society.
We Produce Telugu Short Films, Telugu Best Quality Web Series, Telugu Comedy, Entertainment, Independent Films. Telugu News, Breaking News, Telugu latest, Telugu Live Updates etc.
Please Support Us in Developing Alternative Digital Content.
TTD assets not to sold and who has given authority to sell. Also TTD chairman said earlier also sold the gold and assets, they sold, list out what are they ? What government doing, every rupee given by public, why YSRCP taking unwanted, or step down to centre .jai hind
ReplyDeletePost a Comment