సింగిల్ విండో పాలకవర్గాన్ని వెంటనే రద్దు చేయాలని తహసిల్దార్ కు వినతిపత్రాన్ని సమర్పించిన బిజెపి నాయకులు

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి సింగిల్ విండో ద్వారా చేపట్టిన కొనుగోళ్ల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ఇటీవల తరుచుగా వివిధ దినపత్రికలో వచ్చిన కథనాలను జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో స్థానిక ప్రజాప్రతినిధులు నిలదీసి అడిగితే సంబంధిత పౌరసరఫరాల శాఖ మంత్రి వివరణ ఇస్తూ గన్నేరువరం మరియు చిగురుమామిడి ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ప్రాథమిక విచారణలో తేలిందని చెబుతూ విచారణకు ఆదేశించారు జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయి విచారణ చేస్తూనే ఇటీవల చిగురుమామిడి సింగిల్ విండో సీఈవో ను సస్పెండ్ చేసి విచారణ కొనసాగుతుండగానే పౌరసరఫరాల జిల్లా మేనేజర్ ఫిర్యాదు మేరకు 5గురు దళారులపై గన్నేరువరం ఎస్సై ఆవుల తిరుపతి క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఇందులో చిగురుమామిడి మండలం నవాబుపేట గ్రామానికి చెందిన వ్యక్తి ఉండటం మరియు ధాన్యం కొనుగోళ్లలో అక్రమాల మూలాలు చిగురుమామిడి సింగిల్ విండో నుంచే ఉన్న దృష్ట్యా పూర్తి స్థాయి విచారణ మరియు విజిలెన్స్ తనిఖీలు నిష్పక్షపాతంగా, సక్రమంగా జరిగి రైతులను మోసం చేసిన వారికి శిక్ష పడాలంటే చిగురుమామిడి సింగిల్ విండో పాలకవర్గాన్ని వెంటనే రద్దు చేయాలని చిగురుమామిడి తాసిల్దార్ నుండి జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం ఇచ్చినట్లు బిజెపి మండల ప్రధానకార్యదర్శి బండి ఆదిరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు దాసరి ప్రవీణ్ కుమార్ నేత, కొంకటి లక్ష్మణ్, మిడివెళ్ళి వెంకటయ్య, కళ్ళెం రాంరెడ్డి తదితరులు ఉన్నారు.

https://www.youtube.com/watch?v=hNwox28uk64

0/Post a Comment/Comments

Previous Post Next Post