కరీంనగర్ జిల్లా ఆదివారం అంబేద్కర్ స్టేడియంలో జరిగిన ఉమ్మడి జిల్లా ట్రాక్ సైక్లింగ్ బాల బాలికల ఎంపిక పోటీలో జంగపల్లి ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు మధుమిత, అశ్విత, సాయిప్రసాద్,అభిరామ్, తేజశ్రీ,అర్చన. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు ఈ నెల మూడు నుంచి అయిదు వ తేది వరకు హైదరాబాదులోని యూనివర్సిటీ పరిధిలో ఉన్న ఎస్ఏటిఎస్ సైకిలింగ్ స్టేడియంలో జరుగనున్న పోటీలకు కరీంనగర్ జిల్లా జట్టుకు 8 మంది విద్యార్థులు ఎంపిక కాగా అందులో ఆరుగురు విద్యార్థులు గన్నేరువరం మండలంలోని జంగపల్లి ప్రభుత్వ పాఠశాల నుండి ఎన్నిక కావడం విశేషం పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు వీరిలో తేజస్విని అత్యంత ప్రతిభ కనబరచి జిల్లాలో రికార్డుటైం నమోదు చేసింది ఎంపికైన విద్యార్థులను గ్రామ సర్పంచ్ అట్టికం శారదా శ్రీనివాస్ ఎంపిటిసి రాజేశం పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ బండి తిరుపతి విద్యా కమిటీ సభ్యులు ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు మరియు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.
Post a Comment