తిమ్మాపూర్ మండలంలో పోలీస్ & ప్రెస్ ఫ్రెండ్లీ క్రికెట్

క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని తిమ్మాపూర్ సీఐ మహేశ్ గౌడ్ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం శ్రీ చైతన్య ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో తిమ్మాపూర్ సర్కిల్ పరిధి పోలీసులు, తిమ్మాపూర్ ప్రెస్ టీం సభ్యుల మధ్య క్రికెట్ పోటీలు జరిగాయి. ఎల్ఎండీ, చిగురుమామిడి, గన్నేరువరం ఎస్సైలు నరేష్ రెడ్డి, మధూకర్, తిరుపతితోపాటు పోలీసులు అత్యుత్తమ ప్రతిభను చూపడంతో పోలీస్ టీం విజయం సాధించింది. తిమ్మాపూర్ సీఐ మహేశ్ గౌడ్, కేడీసీసీబీ డైరెక్టర్ కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి ముగ్గురు ఎస్సైలను సన్మానించారు. క్రీడలు ఆడడం మంచి అలవాటని తిమ్మాపూర్ సీఐ మహేశ్ గౌడ్ అన్నారు. రెగ్యులర్ గా ఆడితే క్రీడా స్ఫూర్తి తోపాటు పోటీ తత్వంస స్నేహ సంబంధాలు పెరుగుతుందన్నారు. గెలుపు ఓటములు ముఖ్యం కాదన్నారు. సెలవు దినాలలో గ్రాండ్ క్రికెట్ పోటీలను పోలీస్ శాఖ తరపున సర్కిల్ పరిధిలో నిర్వహించనున్నట్లు తెలిపారు. పోలీస్, ప్రెస్, పొలిటికల్ వారితో ఫ్రెండ్లీ పోటీలు రెండు, మూడు నెలలకోసారి నిర్వహించుకుంటే బాగుంటుందన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post