కరీంనగర్ జిల్లాచిగురుమామిడి: రానున్న పదవ తరగతి ఫలితాల్లో మండలంలోని అన్ని స్కూల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాద్యాయులు కృషిచేయాలని మండల విద్యాధికారి విజయలక్ష్మి తెలిపారు.సోమవారం మండలంలోని ఇందుర్తి గ్రామంలోని పాఠశాలలో మండల స్థాయిలో నిర్వహించిన క్విజ్ పోటీల ముగింపు సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై విద్యాధికారి మాట్లాడారు. పదవ తరగతి విద్యార్థుల ను ప్రోత్సహించే అందుకే మండల స్థాయి క్విజ్ పోటీలను ఏర్పాటు చేశామని తెలిపారు. మొదటి బహుమతి సుందరి విద్యార్థులకు, రెండో బహుమతి ఇందుర్తి పాఠశాల విద్యార్థులకు, మూడో బహుమతి మోడల్ స్కూల్ విద్యార్థులకు అందజేసి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అందే స్వరూప స్వామి, పలు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు లక్ష్మణరావు మహేందర్ రావు శ్రీనివాస్ రెడ్డి బాపు రావు ఎస్ఎంసి చైర్మన్ బింగి కుమార్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
Post a Comment