బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడిగా నాగుల కనకయ్య గౌడ్ నియామకం



 తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా అధ్యక్షునిగా గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన నాగుల కనుక గౌడ్ ని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఎన్నం ప్రకాష్ ఒక ప్రకటనలో తెలిపారు ఆదివారం రోజున కరీంనగర్ నగరంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో నాగుల కనకయ్య గౌడ్ ని జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు తెలిపారు అనంతరం నాగుల కనకయ్య గౌడ్ మాట్లాడుతూ హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీసీ నేత ఈటెల రాజేందర్ మద్దతుగా జిల్లా బీసీ కుల సంఘాల నేతలతో కలిసి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కమిటీ పాల్గొంటున్నానని రాబోయే ఎన్నికల్లో బీసీల సత్తా చాటే విధంగా సంఘాన్ని బలోపేతం చేస్తూ త్వరలో జిల్లాలో అన్ని మండల కమిటీలు వేస్తామని మరియు నా నియామకానికి సహకరించిన తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీకి కృతజ్ఞతలు తెలియజేశారు



0/Post a Comment/Comments

Previous Post Next Post