అలుగునూర్ లో చోరీ - దర్యాప్తు చేస్తున్న పోలీసువారు



 కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం లోని అలుగునూర్ గ్రామంలో సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామంలోని డీసీఎంఎస్ ఫర్టిలైజర్ దుకాణం తో పాటు దాని ఎదురుగా ఉన్న వెంకటేశ్వర సూపర్ మార్కెట్లో సోమవారం అర్ధరాత్రి కొందరు దుండగులు చొరబడ్డారు. డీసీఎంఎస్ షాప్ లో రూ. 35వేలతో పాటు సూపర్ మార్కెట్లో రూ. 5వేల నగదును ఎత్తు వెళ్లారు. అలాగే సూపర్ మార్కెట్ పక్కనే ఓ ఇంటి వద్ద నిలిపిఉన్న ద్విచక్ర వాహనాన్ని దుండగులు అపహరించుకుపోయారు. ఎల్ఎండీ పోలీసులతో పాటు క్లూస్ టీం బృందం ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రమోద్ రెడ్డి తెలిపారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post