తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదం - సాగ‌ర్‌లో ప‌టిష్ఠ భ‌ద్ర‌త



 తెలంగాణ ,  ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల మ‌ధ్య జ‌ల వివాదం కొన‌సాగుతోన్న విష‌యం తెలిసిందే. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ అభ్యంత‌రాలు తెలుపుతుండ‌గా, తెలంగాణ చేస్తోన్న‌ విద్యుదుత్ప‌త్తిపై  ఏపీ మండిప‌డుతోంది. ఈ నేప‌థ్యంలో ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్త‌కుండా నాగార్జున సాగ‌ర్ ప్రాజెక్టు వ‌ద్ద కొన్ని రోజులుగా భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు.


ప్ర‌ధాన విద్యుదుత్ప‌త్తి కేంద్రం వ‌ద్ద  ఈ రోజు కూడా పోలీసుల మోహ‌రింపు కొన‌సాగుతోంది. గ‌తంలో ఇదే ప్రాంతంలో తీవ్ర‌ ఉద్రిక్త ప‌రిస్థితులు చోటు చేసుకున్న విష‌యం తెలిసిందే. ఆ ఘ‌ట‌న‌ను దృష్టిలో పెట్టుకుని మ‌రోసారి అలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా అధికారులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. పటిష్ఠ‌ భద్రత నడుమే సాగర్‌ ఎడమగట్టులోని విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు.


అక్క‌డికి వ‌చ్చేవారిని పూర్తిస్థాయిలో తనిఖీలు చేసిన తర్వాతే విద్యుత్‌ కేంద్రంలోకి అనుమతిస్తున్నారు. మ‌రోవైపు, సాగ‌ర్ ప్రాజెక్టులో వరద ప్రవాహం కొనసాగుతోంది. జలాశయంలోకి 31,131 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. అలాగే, అంతే మొత్తంలో నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా, జలాశయంలో ప్ర‌స్తుతం 174.0610 టీఎంసీల నీరు నిల్వ ఉంది.




0/Post a Comment/Comments

Previous Post Next Post