శాసనసభ్యులు రసమయి బాలకిషన్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న మానకొండూర్ నియోజకవర్గంలో త్వరలో పర్యటిస్తానని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు సిరిసిల్లలో జరిగిన పర్యటనలో ప్రకటించారు.
- తెలంగాణా రాష్ట్ర సాధనలో ఎనక ముందు సూసుడు ఏంది రాజన్న ఓరాజన్న...ఎత్తుర తెలంగాణా జెండా రాజన్న ఓ రాజన్న...పాటను మా రసమయి పాడి ప్రజల్లో చైతన్యం తెచ్చారని కేసీఆర్ గుర్తు చేశారు.
- మానకొండూర్ నియోజకవర్గంలోని ఇల్లంతకుంట మండలం అనంతగిరి అన్నపూర్ణ రిజర్వాయర్ ను త్వరలో పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. గుట్టల మధ్యన నదీ పాయతో, అద్భుతమైన ప్రకృతి సౌందర్యం కలిగి ఉందన్నారు.
- ఇక్కడ సుమారు 243 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, ఈ భూమిని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయడానికి వెంటనే టూరిజం శాఖకు అప్పగిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
- అన్నపూర్ణ రిజర్వాయర్ ను పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేస్తానని ప్రకటించిన శుభ సంధర్బంగా కేసీఆర్ గారికి మానకొండూర్ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ గారు కృతజ్ఞతలు తెలిపారు..
Post a Comment