జగన్ అక్రమాస్తుల కేసులో హెటిరో, అరబిందోపై ఈడీ నమోదు చేసిన కేసు నిన్న సీబీఐ కోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసులో నిందితుడైన అరబిందో కంపెనీ మాజీ కార్యదర్శి పీఎస్ చంద్రమౌళి ఏప్రిల్ 10న మరణించారు. దీంతో ఆయన మరణ ధ్రువీకరణ పత్రం సమర్పించాలని సీబీఐ కోర్టు ఈడీని ఆదేశించింది. అభియోగాల నమోదుకు సమయం ఇస్తూ కేసును వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.
కాగా, ఇదే కేసులో తన తరపున సహకరించడానికి మరో నిందితుడిని అనుమతించాలంటూ జగన్ పెట్టుకున్న పిటిషన్ విచారణకు రాగా దానిని కోర్టు 22వ తేదీకి వాయిదా వేసింది. అలాగే, వాన్‌పిక్, జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులపై సీబీఐ నమోదు చేసిన కేసుల విచారణతోపాటు రాంకీ కేసులో ఏ-2 నిందితుడైన విజయసాయిరెడ్డి డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనల కొనసాగింపునకు విచారణను ఈ నెల 15కు కోర్టు వాయిదా వేసింది.
Post a Comment