పెరుగుతున్న బ్లాక్ ఫంగస్ కేసులు ....ఆరోగ్యశ్రీలో చేర్చిన ఏపీ ప్రభుత్వం



 కరోనా  బారిన పడిన రోగుల్లో  బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బ్లాక్ ఫంగస్ ను ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా నుంచి కోలుకున్న వారికి వచ్చే బ్లాక్ ఫంగస్ కు కూడా చికిత్స చేయాలని ఆదేశించారు. బ్లాక్ ఫంగస్ చికిత్సకు అయ్యే ఖర్చును ప్రభుత్వం నిర్ణయించింది. బ్లాక్ ఫంగస్ చికిత్సపై వెంటనే చర్యలు ప్రారంభించాలని ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవోను ఆదేశించింది.బ్లాక్ ఫంగస్ ఒక్క ఏపీలోనే కాదు, దేశంలోని అనేక రాష్ట్రాలను ఆందోళనకు గురిచేస్తోంది. రాజస్థాన్ ఇప్పటికే దీన్ని అంటువ్యాధిగా ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ఇక్కడి గంగారాం ఆసుపత్రిలో 40 మంది వరకు బ్లాక్ ఫంగస్ బాధితులు చికిత్స పొందుతున్నారు. దీని కారణంగా కంటి చూపు పోవడమే కాదు, రోగి మరణించే ప్రమాదం కూడా ఉండడంతో సర్వత్రా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

0/Post a Comment/Comments

Previous Post Next Post