పేరుకే లాక్ డౌన్, నిబందనలు పాటించేదెవరు?



 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మే 18, 2021: కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో కరోనా  కట్టడికి  తెలంగాణ రాష్ట్రం  లాక్ డౌన్ పొడిగించినపటికి  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొంతమంది పంచాయితీ  పాలకులు, అధికారుల అలసత్వంతో లాక్ డౌన్ నిబంధనలు పాటించేవారు కనిపించడం లేదు. ఉదయం 6 గంటల నుండి  10 గంటల వరకు లాక్ డౌన్ అమలులో ఉండగా రూల్స్ పాటించకుండా ప్రజలు రాత్రి 10 గంటల వరకు రోడ్లపై తిరుగుతున్నారు. లాక్ డౌన్ అతిక్రమించి రోడ్లపై వచ్చిన వారికి పోలీసు వారి సహకారంతో పంచాయితీ సిబ్బంది జరిమానా విధించిన అది 40% ప్రజలపై మాత్రమే ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో నిబంధనలను అమలు సరే, కనీసం  కరోనా సోకిన వారు రోడ్ల మీదకు వచ్చి యధేచ్ఛగా తిరుగుతుంటే పట్టించుకునే నాథుడు లేక మొదట విడత కరోనా సమయంలో గ్రీన్ జోన్ లో ఉన్న జిల్లా ఇప్పుడు గ్రీన్ జోన్ కి దరిదాపుల్లో కుడా లేదు. చిన్న చిన్న పంచాయితీల వల్ల గ్రామాల అభివృధి త్వరితగతిన జరిగే అవకాశాలతో పాటు, పరిపాలన పారదర్శకంగా సాగుతుంది అనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని పంచాయతీలను పెంచిన నేపద్యంలో మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి పనులు పక్కన పెడితే, కరోనా కట్టడి,  కనీసం సామాన్య ప్రజలకు కరోనా గురించి అవగాహన కల్పించడంలో  కొన్ని  పంచాయితీల సర్పంచులు, సెక్రటరీలు విఫలం అయ్యారు అనటంలో  సందేహం లేదు. దీనంతటికీ కారణం  అధికారులు స్థానికంగా ఉండకపోవడమే అని, దీంతో పాలకులకు, అధికారులకు మద్య సఖ్యత లేకపోవడం అటు అభివృద్ది పనులు, ఇటు కరోనా కట్టడి చేయడంలో విపలమవుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. జిల్లా యంత్రాంగం స్పందించి తగు చర్యలు తీసుకొని రాబోవు కాలంలో కరోనా రహిత జిల్లాగా చేయాలని ప్రజలు కోరుతున్నారు.



0/Post a Comment/Comments

Previous Post Next Post