మావోయిస్టు బంద్ నేపద్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత ఏర్పాట్లు లలో భాగంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతా పోలీస్ స్టేషన్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల జిల్లా చెన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోటపల్లి పోలీస్ స్టేషన్ ని రామగుండం కమిషనరేట్ ఓఎస్డీ చంద్ర పవర్ ఐపీఎస్ సందర్శించారు.అధికారులతో ప్రస్తుత పరిస్థితిల అడిగి తెలుసుకున్నారు .ఎప్పుడు అప్రమత్తంగా ఉనడాలని ఎట్టిపరిస్థితులలో అలసత్వం ప్రదర్శించావద్దన్నారు.
ఈ సందర్భంగా ఓఎస్డీ గారు మాట్లాడుతూ... మావోయిస్టు బంద్ నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు కోటపల్లి పోలీస్ స్టేషన్ సందర్శించడం జరిగింది అని కోటపల్లి నీల్వాయి మరియు రామగుండం కమిషనరేట్ పరిధిలో ఏక్కడ కూడా మావోయిస్టు బంద్ ప్రభావం అనేది లేదు. ప్రస్తుతం ప్రజలు కూడా మావోయిస్టు లు చెప్పేటువంటి మోసపూరితమైన, మాయ మాటలు నమ్మే పరిస్థితిలో లేరు. మావోయిస్టు బంద్ అనేది కాకుండా సాధారణ రోజులలో ఏలా ఉంటారో అలానే ప్రజలు కూడా అందరూ ఎవరి పనిలో వారు ఉన్నారు.మావోయిస్టుల బంద్ నేపథ్యంలో జిల్లాలో ఏలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా,విధ్వంసాలకు పాల్పడకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి, శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నాం అన్నారు.మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో గ్రేహౌండ్స్ పార్టీలు, స్పెషల్ పార్టీలు,కౌంటర్ యాక్షన్ పార్టీలతో,కూబీయింగ్ అంబుష్,ఏరియా డామినేషన్ లను నిర్వహించడం జరుగుతుంది.మావోయిస్టులు ఎలాంటి చిన్న సంఘటన చేయకుండా ,ఒకవేళ ఎలాంటి సంఘటనకు పాల్పడిన వారు తప్పించుకోవడానికి అవకాశం లేదు అన్ని రకాల పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది అన్నారు.
ఓఎస్డీ గారి వెంట జైపూర్ ఏసిపి నరేందర్, చెన్నూర్ రూరల్ సీఐ నాగరాజు ఉన్నారు.
Post a Comment