విక్రమ సింహపురి విశ్వవిద్యాలయ NSS ప్రోగ్రాం అధికారుల సమావేశం



  •  జాతీయ సేవా పథకం  ప్రోగ్రాం అధికారుల సమావేశం ఘనంగా నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఆర్ము సుదర్శన రావు ము ఖ్య అతిదిగా, రెక్టార్ ఆచార్య  యం చంద్రయ్య  మరియు డా. యల్ విజయ కృష్ణా రెడ్డి విశిష్ట అతిధులుగా పాల్గొని కార్యక్రమాన్ని పారంభించారు. ఉపకులపతి మాట్లాడుతూ అందరు ఒక ప్రత్యేక ప్రణాళికతో దత్తత గ్రామాలలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. కోవిడ్ సమయంలో విశ్వవిద్యాలయ సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం ఆధ్వర్యంలో  కొంతమంది NSS వాలంటీర్లు హెల్ప్ ది నీడి అనే ఒక టీం ఏర్పడి అనేక రకాల సేవ కార్యక్రమాల చేపట్టారని అది కచ్చితంగా గర్వించదగ్గ విషయం అని అన్నారు. NSS ప్రోగ్రాం అధికారులు ఇతర సేవా సంస్థలతో కలిసి జిల్లా లోని వివిధ సామాజిక రుగ్మతలను నిర్మూలించటంలో మరియు జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలని కోరారు. రెక్టార్ ఆచార్య యమ చంద్రయ్య గారు NSS ద్వారా చేపట్టే ప్రతి చిన్న సేవా కార్యక్రమాన్ని విశ్వవిద్యాలయానికి తెలియచేసి విశ్వవిద్యాలయ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు  అలాగే nSS ప్రోగ్రాం అధికారులు రెట్టుమ్పు చురుకుతనంతో  మరియు ఉత్సాహంతో NSS కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు 

రిజిస్ట్రార్ ప్రతి కళాశాల ప్రోగ్రాం అధికారి బరువుతో కాకుండా బాధ్యతతో NSS కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. దేశ  స్థాయిలో NSS విభాగం ద్వితీయ స్థానంలో నిలబడటం అందరి సమిష్ట కృషి అని  అందుకు అందరిని అభినందిస్తున్నానని, మల్లి అదే  స్థాయిలో విశ్వవిద్యాలయకు మంచి పేరు తీసుకు రావాలని ఆకాంక్షించారు. విద్యార్థులలో  ప్రేరణ కల్పించి దేశ  పురోగతిలో భాగస్వాములను చేయాలని కోరారు. 

సమన్వయ కర్త డా. ఉదయ్ శంకర్ అల్లం,   NSS గురించి అలాగే NSS ప్రోగ్రాం అధికారుల  బాధ్యతల గురించి పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా విపులంగా వివరించారు.. NSS విభాగానికి నిరంతర సేవలందించిన పలువురు అధ్యాపకేతర సిబ్బందిని మెమెంటో తో సత్కరించారు. అలాగే, సమన్వయ కర్త డా. ఉదయ్జి శంకర్ అల్లం లోని శాలువాతో ఘనంగా సత్కరించారు. అనుబంధ కళాశాల నుంచి సుమారు 60 మంది NSS ప్రోగ్రాం అధికారులు , కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సుజా ఎస్  నాయర్, NSS పి  ఓ  డా. వై  విజయ,  పి ఆర్ ఓ  డా. నీల మణికంఠ పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post