తెలంగాణలో కొత్తగా 887 కరోనా కేసులు

 


తెలంగాణలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదయ్యాయి. నిన్న రాత్రి 8 గంటల వరకు 59,297 మందికి టెస్టులు నిర్వహించగా 887 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీనికి సంబంధించిన బులెటిన్ ను తెలంగాణ వైద్యశాఖ ఈరోజు విడుదల చేసింది. గత 24 గంటల్లో నలుగురు కరోనా వల్ల చనిపోయారు. ఇదే సమయంలో 337 మంది కరోనా నుంచి కోలుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 201 కేసులు నమోదయ్యాయి. తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,701కి చేరింది.తెలంగాణలో ఇప్పటి వరకు 1,02,10,906 శాంపిల్స్ ని పరీక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,511 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 2,166 మంది హోమ్ ఐసొలేషన్ లో చికిత్స పొందుతున్నారు.

 

0/Post a Comment/Comments

Previous Post Next Post