రుణాలపై చక్రవడ్డీ మాఫీ, మారటోరియం కొనసాగింపుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు!

 


లాక్ డౌన్ వల్ల అనేకులు తమ ఉపాధిని కూడా కోల్పోయారు. దీంతో, వారు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేని పరిస్థితి నెలకొంది.ఈ నేపథ్యంలో, రుణాలపై ఆర్బీఐ మారటోరియం విధించింది. మారటోరియంను మరికొంత కాలం పొడిగించాలంటూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు... ఆర్థిక ప్యాకేజీలు, ఉద్దీపన ప్యాకేజీలను ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి, ఆర్బీఐకి తాము ఆదేశాలను జారీ చేయలేమని స్పష్టం చేసింది.మారటోరియం కాలంలో రుణాలపై చక్రీవడ్డీని పూర్తిగా ఎత్తేయాలని ఆదేశించలేమని సుప్రీం తెలిపింది. మారటోరియం కాలాన్ని పెంచాలని కూడా తాము చెప్పలేమని వ్యాఖ్యానించింది. ఆర్థిక పరమైన అంశాల్లో న్యాయపరమైన విచారణను చేపట్టలేమని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ. 2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీని మాఫీ చేసిందని గుర్తు చేసింది.

0/Post a Comment/Comments

Previous Post Next Post