ప్రధానికి కేసీఆర్ కి లేఖ

 


పార్లమెంట్  కొత్త భ‌వ‌న స‌ముదాయానికి రేపు భూమి పూజ చేయ‌నున్న నేప‌థ్యంలో అభినంద‌న‌లు తెలుపుతూ  ప‌్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీకి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ లేఖ రాశారు. సెంట్ర‌ల్ విస్టా ప్రాజెక్టుకు శంకుస్థాప‌న కార్యక్రమం జరుగుతుండడం భారత సార్వ‌భౌమ‌త్వానికి గర్వ‌కార‌ణ‌మ‌ని చెప్పారు.ఈ ప్రాజెక్టు ప్రారంభం విషయంలో చాలా కాలంగా జాప్యం జరుగుతోందని చెప్పారు. ప్ర‌స్తుత‌మున్న పార్ల‌మెంటు, కేంద్ర సచివాలయ భ‌వనాలు ప్రభుత్వ పనులకు పూర్తిస్థాయిలో స‌రిపోవ‌డం లేద‌ని పేర్కొన్నారు. ప్ర‌తిష్ఠాత్మ‌కంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు పనులు వీలైనంత త్వ‌ర‌గా పూర్తి కావాల‌ని అన్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post