కడప- రాయచోటి : ఆంధ్రప్రదేశ్ దళిత వేదిక మరియు హీబా బ్లడ్ డొనేషన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో, తలసేమియా చిన్నారుల కు, గర్భిణీ స్త్రీలకు, యాక్సిడెంట్ అయిన వారి కోసం రక్తదాన శిభిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాయచోటి అర్బన్ సిఐ రాజు విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుమారు 30 మంది వరకు యువకులు పాల్గొని రక్తదానం చేసారు . ఈ కార్యక్రమంలో ఏపీ దళిత వేదిక రాయచోటి అధ్యక్షుడు వి.మహేష్ హీబా బ్లడ్ డొనేషన్ ఆర్గనైజర్ వ్యవస్థాపకులు పఠాన్, కేకేఆర్ ఆర్గనైజేషన్ వ్యవస్థాపకులు, పవన్ యువసేన వ్యవస్థాపకులు , ఏపీ దళిత వేదిక సంయుక్త కార్యదర్శి అనిల్ కుమార్ మరియు సభ్యులు పవన్, సాయి, బన్నీ, బాలు, వినయ్ కుమార్, శివాజీ పాల్గొన్నారు
Post a Comment