హైదరాబాద్ ,రంగారెడ్డి, మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణీదేవి విజయం దిశగా సాగుతున్నారు. ఆరో రౌండ్ ముగిసే సరికి సమీప బీజేపీ ప్రత్యర్థి రామచంద్రరావుపై 7,626 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆరు రౌండ్లలోనూ కలిపి ఆమెకు 1,05,710 ఓట్లు పోలవగా, రామచంద్రరావుకు 98,084 ఓట్లు వచ్చాయి.ఇక ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగిన ప్రొఫెసర్ నాగేశ్వర్‌కు 50,450 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డికి 29,627, టీడీపీ అభ్యర్థి ఎల్ రమణకు 5,606 ఓట్లు వచ్చాయి. ఈ లెక్కన చూస్తే వాణీదేవి గెలుపు దాదాపు ఖరారైనట్టే. రేపు రాత్రికి తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
Post a Comment