పౌల్ట్రీ కోళ్ల ఫారం నిర్మాణం అనుమతులు రద్దు చేయాలని - కలెక్టర్ కార్యాలయం ముందు మైలారం గ్రామస్తులు ధర్నా

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం మైలారం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం ప్రక్కన నిర్మిస్తున్న వేదాంత పౌల్ట్రీ కోళ్ల ఫారం నిర్మాణం అనుమతులు రద్దు చేయాలంటూ కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆలయ చైర్మన్ వరాల పర్శారాములు ఆధ్వర్యంలో మైలారం  గ్రామస్తులు ధర్నా చేపట్టారు  సుమారు కోటి రూపాయలతో చందాలు విరాళాలు సేకరించి గుడి నిర్మించామని మల్లికార్జున స్వామి  ఆలయాన్ని రక్షించాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం జిల్లా కలెక్టర్ శశాంక కి వినతి పత్రం అదజేశారు ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ వరాల పర్షరాములు  మాట్లాడుతూ ప్రముఖ శైవ క్షేత్రం మైలారం మల్లికార్జున స్వామి

 కోరిన కోర్కెలు తీర్చే మహిమగల దేవుడిగా విరాజిల్లుతు 800 సంవత్సరాల విశిష్టత కలిగిన మల్లికార్జున స్వామి ఆలయం కాపాడాలని పక్కనే సీతారామాంజనేయ స్వామి ఆలయం ఉందని వరి రక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన అన్నారు BSF రాష్ట్ర అధ్యక్షుడు జక్కనపెళ్లి గణేష్ మాట్లాడుతూ గ్రామస్తులకు తెలియకుండా ఆలయం పక్కనే వేదాంత పౌల్ట్రీ ఫామ్ పేరుతో అనుమతి ఇవ్వడం  అధికారుల అలసత్వానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు ...ఆది బుధవారాల్లో మన  రాష్ట్రం నుండే కాకుండా మహారాష్ట్ర చత్తీస్గడ్ రాష్ట్రల నుండి దైవదర్శనం నిమిత్తం భక్తులు వచ్చి బోనాలు చేసి, పట్నం వేసి మొక్కులు సమర్పిస్తారని ఆయన అన్నారు ..

స్వామి ఆలయం చేరువలో మానేరు డ్యాం పక్కనే గుట్టలు  ఉండడంతో ఆహ్లాదాన్ని పంచే పచ్చని చెట్ల మధ్యలో చూపరులను ఎంతగానో ఆకట్టుకునే ఆలయం పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతున్నది  ..

ఈ కోళ్ల ఫారం కడితే దుర్గంధం వెదజల్లి  వాసనతో ఈగలు దోమలతో స్వామి వారి ఆలయానికి భక్తుల రాక తగ్గిపోనుంది ...కోళ్ళ ఫారం పర్మిషన్ రద్దు చేసి పురాతనమైన  మల్లికార్జున స్వామి ఆలయాన్ని  కాపాడాలని ఆయన కోరారు ...

లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన తప్పదని ఆయన హెచ్చరించాడు ....

కార్యక్రమం లో భారీ సంఖ్యలో మహిళలు ప్రజలు స్వామి వారి భక్తులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post