ఎపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు పెండింగు నిధులు, హైకోర్టు తరలింపు తదితర అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జగన్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. రాజకీయ పరిణామాలను అమిత్ షాకు జగన్ వివరిస్తారని తెలుస్తోంది. అలాగే, రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల విషయం కూడా వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.
Post a Comment