కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం ఖాసీంపేట క్లస్టర్లో నూతనంగా ఏర్పడిన రైతు వేదికలో తెలంగాణ రాష్ట ప్రభుత్వం వ్యవసాయ శాఖ సమగ్ర పంటల యాజమాన్యం అవగాహన సదస్సు లో రైతులు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు మరియు అధికారులతో నిర్వహించిన సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరయ్యారు
ఇటీవల రాష్ట్రస్థాయి పుడమి పుత్ర అవార్డు పొందిన రైతు దంపతులకు ఘన సన్మానం చేశారు
- రైతు పోస్టర్ ఆవిష్కరణ ...
ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతును రాజుగా చూడాలనేది ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యం అని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి లక్ష్యానికి అనుగుణంగా అధికారులు ప్రజాప్రతినిధులు పని చేయాలి.
- రైతు కల్లాల గురించి రైతులకు పూర్తి అవగాహన కల్పించాలి అని అన్నారు
- అలాగే రైతులకు 24గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
- కేవలం మూడు సంవత్సరాల్లో సుమారు 80 వేల కోట్లతో కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి సుమారుగా కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ భగీరథ ప్రయత్నమే అని
- రైతు బీమా పథకం ద్వారా రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే భీమా చెల్లించి రైతు ఏదైనా ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షల రూపాయల ఉచిత బీమా ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు ...
- ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం దేశం మొత్తానికి అన్నపూర్ణ రాష్ట్రంగా మారింది అని అన్నారు..
- అనంతరం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంఫణి చేసాడు ఈకార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, గన్నేరువరం జడ్పీటీసీ మాడుగుల రవీందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ గంప మల్లేశ్వరి వెంకన్న, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు గుడెల్లి తిరుపతి,పారువెళ్ల సర్పంచ్ తీగల మోహన్ రెడ్డి,నాయకులు పుల్లెల లక్ష్మణ్, దొడ్డు మల్లేశం, ఏలేటి చంద్రారెడ్డి, బూర వెంకటేశ్వర్, తోట కోటేశ్వర్, బద్దం సంపత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు
Post a Comment