- పైసలు వచ్చిన ఇవ్వడం లేదని లబ్ధిదారుల ఆగ్రహం
- సర్పంచ్, కార్యదర్శిపై మండిపాటు
బిల్లులు వచ్చినా పైసలు ఇవ్వడం లేదంటూ కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం హన్మాజిపల్లె వాసులు సర్పంచ్, కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
గ్రామ పంచాయతీ ఆవరణలో శుక్రవారం గ్రామ సభను నిర్వహించగా, ఇంకుడు గుంతల బిల్లులు తమకు రాలేదని లబ్ధిదారులు మండిపడ్డారు. 24 మంది లబ్ధిదారులకు ఈజీఎస్ పనుల బిల్లులు వచ్చిన కూడా తమకు ఇవ్వడం లేదని బాధితుల ఆందోళనకు దిగారు. 2016లో ఈజీఎస్ పనులు పూర్తయితే
24 మంది లబ్ధిదారులకుగానూ, రూ. 79,104 గ్రామ పంచాయతీ బ్యాంక్ లో జమ అయినట్లు అధికారులు తెలిపారు. అయితే వాటిని లబ్ధిదారులకు ఇవ్వడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.
Post a Comment