కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని ఖాసీంపెట్ గ్రామంలో గురువారం బీజేపీ దళిత మోర్చా ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పొలాబిషేకం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని అవమాన పరిచే విధంగా మాట్లాడిన స్వేరోస్ అధినేత, తెలంగాణ గురుకులాల కార్యదర్శి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ను విదుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మానకొండూర్ నియోజకవర్గం ఇన్చార్జి గడ్డం నాగరాజు, మండల పార్టీ అధ్యక్షుడు నగునూరి శంకర్, బీజేపీ దళిత మోర్చా మండలం అధ్యక్షుడు బామండ్ల రాజు, అటికం రాజేశం, రాష్ట్ర నాయకుడు సొల్లు అజయ్ వర్మ , బిజేపి నాయకులు, కార్యకర్తలు, తదితర నాయకులు పాల్గొన్నారు
Post a Comment