సాంకేతిక లోపం కారణంగా ఓ రైలు 35 కిలోమీటర్ల దూరం రివర్స్‌లో వెళ్లింది. ఉత్తరాఖండ్‌లో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. ఢిల్లీ నుంచి బయలుదేరిన పూర్ణగిరి జనశతాబ్ది ఎక్స్‌ప్రెస్ ఉత్తరాఖండ్‌లోని తనక్‌పూర్ జిల్లా మీదుగా వెళ్తున్న సమయంలో ట్రాక్‌పైకి పశువులు రావడాన్ని గుర్తించిన లోకో పైలట్ సడెన్ బ్రేక్ వేశాడు. దీంతో ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది.ఉన్నట్టుండి రైలు వెనక్కి వెళ్లడం ప్రారంభించి, అలాగే 35 కిలోమీటర్లు వెళ్లి ఖాతిమా దగ్గర నిలిచిపోయింది. ఆ సమయంలో అది చాలా వేగంగా వెళ్లింది. ఇంజిన్‌పై లోకోపైలట్ నియంత్రణ కోల్పోవడంతో ఏమీ చేయలేకపోయాడు. రైలు ఆగిన అనంతరం ప్రయాణికులను కిందికి దించి ఖాతిమా నుంచి బస్సుల ద్వారా తనక్‌పూర్‌కు పంపారు. ఆ రైలు నడిపిన లోకోపైలట్, గార్డ్‌లపై అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు.
Post a Comment