నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో యూత్ పార్లమెంట్ కార్యక్రమం

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం కేంద్రంలో కౌండిన్య కమ్యూనిటీ వెల్ఫేర్ సొసైటీ భవనములో శుక్రవారం నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో  యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మండల తాసిల్దార్  బండి రాజేశ్వరి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆమె మాట్లాడుతూ యువత అన్ని రంగాల్లో ముందుండాలని స్వయం ఉపాధిని పొందాలని రాబోయే కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు కోరుతా ఉంటుందని అందుకే వారందరు స్వయం ఉపాధితో పాటు పది మందికి ఉపాధి కల్పించే అవకాశాలను నెలకొల్పాలని యువకులు సెల్ఫోన్లకు బానిసలుగా మార వద్దు అని వ్యవసాయ రంగాలలో కూడా ఆధునికత ప్రోత్సహించుట కొత్త మార్గాలను అన్వేషిస్తూ వ్యవసాయరంగంలో ముందుకు సాగాలని అన్నారు నెహ్రూ యువ కేంద్ర కోఆర్డినేటర్ రాంబాబు  మాట్లాడుతూ పీఎంఈజీపీ పీఎం కే వై వంటి పథకాలను యువతీ యువకులు ఉపయోగించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో  సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అధికారి స్వప్న మాట్లాడుతూ స్వయం ఉపాధి బృందాలు అనుకున్నవారికి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారని అర్హులు వాటిని  సద్వినియోగం చేసుకోవాలని గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువకులు నైపుణ్య శిక్షణ తరగతులను పొంది ఉపాధి అవకాశాలు పొందవచ్చు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగానే భారత స్వతంత్ర 75 వ సంవత్సర వేడుకలు ఈ వారంలో మొదలు కావడంతో యువకులంతా పాదయాత్రగా మండల కేంద్రంలో స్వతంత్ర అమరవీరులను తలుస్తూ ర్యాలీ తీశారు ఈ కార్యక్రమంలో యువ చైతన్య  యూత్ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి ,మండల యువకులు రజనీకాంత్, వినయ్ .హరికృష్ణ రెడ్డి. లక్ష్మణ్. నెహ్రూ యువ కేంద్ర వాలంటరీ అనిల్ రెడ్డి. రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post