చీమలకుంటపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉపాధీ హామీ గ్రామ సభ రసాభాస

 


కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చీమలకుంటపల్లి, గుండ్లపల్లి  గ్రామాల్లో  ఆదివారం సామాజిక తనిఖీ బృందం గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఉపాధి హామీ పథకం కూలీల, పాలక వర్గం సమక్షంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా నిధులతో  గ్రామంలో నర్సరీ,చెట్ల పెంపకం, వివిధ రకాల పనులు  చేశారు. గ్రామం లో పలు రకాల పనులను కూలీలతో చేయించారు , సంవత్సరం పాటు జరిగిన పనులపై సామాజిక తనిఖీ బృందం జరిగిన పనులపై తనిఖీ నిర్వహించారు. చీమలకుంటపల్లిలో  తనిఖీ నివేదికలను గ్రామసభలో చదివి వినిపించగానే  పనికి రాకుండానే కొందరి కూలీల కుహాజర్ వేసినట్లు డీఆర్ పి లు తెలుపగానే ఒక్క సారి గ్రామసభ రసాభాస గా మారింది.  చేసిన పనులకు కూలీ డబ్బులు త్వరగా ఇప్పించాలని, పనులు కల్పించాలని ఉపాధి హామీ కూలీలు సామాజిక తనిఖీ బృందాన్ని కోరారు. ఈ సమావేశంలో అబ్జర్వేషన్ అధికారులు కిరణ్ కుమార్, సురేందర్, బెజ్జంకి ఎంపిడిఓ రాఘవేందర్ రెడ్డి,  డీఆర్ పి లు శంకర్, జితేందర్,  పంచాయతీ కార్యదర్శులు రంజిత, లచ్చయ్య,  సర్పంచులు కర్ర రేఖ, బేతెల్లి సమత,  ఉపసర్పంచులు  జంగిటి ప్రకాశ్, చింతల పద్మ,వార్డు సభ్యులు, ఉపాధి హామీ కూలీలు, గ్రామస్తులు పాల్గొన్నారు

0/Post a Comment/Comments

Previous Post Next Post