బ్యాంక్ కి శవాన్ని తీసుకొచ్చి డబ్బులివ్వాలని ... గ్రామస్తుల డిమాండ్

 


ఓ వ్య‌క్తి చ‌నిపోయాడని, ఆయ‌న అంత్య‌క్రియ‌ల కోసం ఆయ‌న బ్యాంకు ఖాతాలో నుంచి డ‌బ్బు ఇవ్వాల‌ని కోరుతూ ఓ గ్రామ‌స్థులు బ్యాంకుకు వెళ్లి అడిగారు. అయితే, ఖాతాదారుడికి మాత్ర‌మే డ‌బ్బులు ఇస్తామ‌ని, ఇత‌రులు వ‌చ్చి ఇవ్వాల‌ని అడిగితే ఎలా ఇస్తామ‌ని, రూల్స్ ఒప్పుకోవ‌ని బ్యాంకు మేనేజ‌ర్ వారిని తిప్పిపంపించాడు. దీంతో గ్రామ‌స్థుల‌కు చిర్రెత్తుకొచ్చింది. మృత‌దేహాన్ని బ్యాంకు లోప‌లికి తీసుకొచ్చి ఆయ‌న డ‌బ్బును ఆయ‌న‌కు ఇచ్చేయాల‌ని డిమాండ్ చేశారు. ఈ విచిత్ర ఘ‌ట‌న బీహార్ రాజధాని పాట్నా సమీపంలోని షాజహాన్‌పూర్, సిగరియావా గ్రామంలో చోటుచేసుకుంది. మహేశ్ యాదవ్ (55) అనే వ్య‌క్తికి ఎవ‌రూ లేరు. ఒక్క‌డే ఉంటూ ప‌నిచేసుకుంటూ స్థానిక‌ బ్యాంకు ఖాతాలో డ‌బ్బు జ‌మ చేసుకుంటుండేవాడు. దాదాపు లక్ష రూపాయల వ‌ర‌కు ఆయ‌న బ్యాంకు ఖాతాలో డ‌బ్బు ఉంది. బ్యాంకు ఖాతాకు నామినీ కూడా ఎవరూ లేరు. అనారోగ్యం కారణంగా అత‌డు మృతి చెందాడు. దీంతో అత‌డికి ఎవ‌రూ లేక‌పోవ‌డంతో అతని అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆయ‌న డ‌బ్బు ఇవ్వాల‌ని కోరుతూ గ్రామస్థులు బ్యాంకుకు వెళ్లారు. బ్యాంకు మేనేజర్ నిరాకరించడంతో మహేశ్ యాదవ్ మృతదేహాన్ని నేరుగా బ్యాంకులోకి తీసుకువచ్చి, డ‌బ్బు ఇచ్చేదాకా వెళ్ల‌బోమ‌ని చెప్పారు. మూడు గంటలపాటు మహేశ్ మృతదేహం బ్యాంకులోనే ఉండ‌డంతో బ్యాంకు మేనేజర్ చివ‌ర‌కు  తన సొంత‌ డ‌బ్బు రూ.10 వేలు తీసి వారికిచ్చి పంపించాడు.


0/Post a Comment/Comments

Previous Post Next Post