కరోనా వలన ఐటీ సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే అవకాశం కల్పిస్తోన్న విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి ఇప్పటికీ తగ్గకపోవడం, త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి రానుండడంతో తిరిగి ఉద్యోగులు కార్యాలయాలకు వెళ్తారా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) నిర్వహించిన ఓ సర్వేలో పలు విషయాలు వెల్లడయ్యాయి. ఐటీ ఉద్యోగులు ఇప్పట్లో పూర్తి స్థాయిలో కార్యాలయాలకు వెళ్లటం సాధ్యం కాకపోవచ్చని తేలింది. ఇంటి నుంచి పని ఈ ఏడాది మార్చి వరకు నిరాటంకంగా కొనసాగుతుంది. ఆ తర్వాత క్రమంగా కార్యాలయాలకు వెళ్లడం ప్రారంభం అవుతుంది. ఈ ఏడాది చివర్లో అది బాగా పెరుగుతుంది. అయితే, 100 శాతం మంది కార్యాలయాలకు వెళ్లి పనిచేయడం అనేది ఉండకపోవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్‌లో కాకుండా వేరే ప్రాంతాల నుంచి వర్క్ ఫ్రం హోం చాలా మంది చేస్తున్నారు.
Post a Comment