చనిపోయిన మనిషిని బ్రతికించడానికి 25 రోజులుగా ప్రత్యేక ప్రార్థ‌న‌లు... అరెస్ట్ చేసిన పోలీసులు

 


మెడికల్ లీవ్ లో  ఓ మహిళా పోలీసు లీవుల‌ గడువు ముగిసిన‌ప్ప‌టికీ విధులకు హాజ‌రు కావ‌ట్లేదు. దీంతో  ఇద్దరు మహిళా పోలీసులు ఆమె ఇంటికి వెళ్లి చూడ‌గా షాకింగ్ విష‌యం తెలిసింది. ఆ మ‌హిళా పోలీసు మృతదేహాన్ని వస్త్రాలతో చుట్టి ఓ గ‌దిలో ఉంచారు కుటుంబ స‌భ్యులు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించి, వివ‌రాలు తెలిపారు. పోలీసు కంట్రోల్‌రూంలో పనిచేసే త‌మిళ‌నాడులోని టీ.నగర్‌లోని దిండుగల్‌ నందవనపట్టికి చెందిన మ‌హిళ‌ అన్నై ఇందిర (38) భర్తను విడిచి తన బిడ్డతోపాటు అక్క వ‌ద్ద ఉంటోంది. అనారోగ్యంతో ఆమె చనిపోయింది. అయితే, అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించ‌కుండా ఆమె కుటుంబ స‌భ్యులు మృతదేహంతో 25 రోజులుగా ప్రార్థనలు నిర్వహించారు.ఏసుక్రీస్తులా మృతురాలు తిరిగి లేస్తుందనే నమ్మకంతో ఇలా చేశారు. డిసెంబరు 7నే ఆమె మృతి చెందింద‌ని పోలీసులు గుర్తించారు. దీంతో మృతురాలి అక్క‌తో పాటు మ‌రో వ్య‌క్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post