అమెరికా సైనికులను చంపితే రివార్డ్ ... ఆఫ్ఘన్ యోధులకు ఎరవేస్తున్న చైనా!


 

ప్రపంచ నలుమూలల  ఏం జరుగుతోందో అమెరికా అధ్యక్షుడికి చేరవేసే బాధ్యత నిఘా సంస్థ సీఐఏదే. ఇటీవల సీఐఏ ఆసక్తికర అంశాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నివేదించింది. అమెరికా సైనికులను చంపితే నజరానాలు ముట్టచెబుతామంటూ ఆఫ్ఘనిస్థాన్ యోధులకు చైనా ఎరవేస్తోందని సీఐఏ తెలిపింది. అందుకు తగిన ఆధారాలను సీఐఏ ట్రంప్ కు అందించిందా? అనేది వెల్లడికాలేదు. ట్రంప్ అధికారంలోకి వచ్చాక అమెరికా, చైనా మధ్య సంబంధాలు క్షీణించాయి. అయితే, ఆఫ్ఘనిస్థాన్, సిరియా వంటి దేశాలు అమెరికా దళాలకు యుద్ధరంగాలుగా మారిన నేపథ్యంలో, ఆయా ప్రాంతాల్లో అమెరికాకు వ్యతిరేకంగా చైనా ఎలాంటి చర్యలకు పాల్పడిన దాఖలాలు లేవు. తాజాగా సీఐఏ ఆరోపణల్లో నిజమెంత అన్నదానిపై రక్షణ రంగ నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.ఇటీవలే రష్యా విషయంలో సీఐఏ అందించిన సమాచారాన్ని ట్రంప్ ఉత్త గాలివార్తగా కొట్టిపారేశారు. రష్యా కూడా ఇదే తరహాలో అమెరికా సైనికులను చంపేందుకు కుట్రలకు పాల్పడుతోందని సీఐఏ నివేదికలో పొందుపరిచింది. దీన్ని ట్రంప్ నమ్మలేదు. ఇప్పుడు చైనా విషయంలోనూ ఆయన సీఐఏ నివేదికను పెద్దగా పట్టించుకునే అవకాశాల్లేవని భావిస్తున్నారు.

0/Post a Comment/Comments

Previous Post Next Post